రాజస్థాన్‌లో భారత యుద్ధ విమానం కూలిపోయింది. హనుమాన్‌ఘర్ జిల్లాలోని బహ్లోల్‌నగర్‌లోని నివాసంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మిగ్-21 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు కూడా మృతి చెందారు. వారంతా దినసరి కూలీలుగా గుర్తింపు పొందారు.
కాగా, శిక్షణలో భాగంగా సూరత్‌గఢ్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానం కూలిపోయింది. పైలట్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఇదిలా ఉండగా, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.
