కృష్ణా జలాల పంపిణీని కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించటం ఆ పార్టీ ప్రభుత్వం చేతగానితనమన్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి.ఇవాళ(బుధవారం) తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన…కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనంతో ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాలు సాగు, తాగునీరు కోసం కేంద్రం అనుమతి కోసం ఎదురు చూడాల్సి వస్తుందని ఆరోపించారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల కృష్ణా జలాల ట్రిబ్యునల్ వివాదం తీర్చడానికి ప్రధాని మోడీకి 9 ఏళ్లకు పైగా పట్టిందన్నారు. నాడు కేసీఆర్ సీఎంగా ఉండి కృష్ణా జలాల విషయంలో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు తీర్చుకుంటాయని, కేంద్రం తల దూర్చవద్దని తేల్చి చెప్పారన్నారు.
గత పదేళ్లలో సాగునీరు, తాగునీరుతో పాటు నాణ్యమైన విద్యుత్ అందించామని… తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కష్టాలు తెస్తోందన్నారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: CA ఫౌండేషన్ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి..!!
