కెనడాలో ఘోర విమానం ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు. చిన్నపాటి కంప్యూటర్ ప్లేన్ లో గని కార్మికులను తరలిస్తున్న సమయంలో ఈ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటన వాయవ్య కెనడ పర్వత ప్రాంతాల్లో జరిగింది. ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డట్లు సమాచారం. అతని పరిస్థితి గురించి మీడియా వెల్లడించలేదు. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:50 గంటలకు జరిగింది.
ఇది కూడా చదవండి: వన్ ప్లస్ 11 స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్..!!
ఫోర్ట్ స్మిత్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ విమానం నుంచి సంబంధాలు తెగిపోయినట్లు ఒంటారియోలోని రెస్య్కూ సెంటర్ వెల్లడించింది. నార్త్ వెస్ట్రన్ ఎయిర్ కంపెనీకి చెందిన ట్విన్ టర్బో విమానం ప్రమాదానికి గురైనట్లు తెలిపు. రన్ వే నుంచి కిలోమీటర్ దూరం వెళ్లిన తర్వాత ఆ విమానం కూలింది. దీంతో పోర్ట్ స్మిత్ నుంచి బయలుదేరాల్సిన విమానాలను రద్దు చేశారు. ప్రమాదంపై కెనడా ట్రాన్స్ పోర్టు విభాగం దర్యాప్తు చేపట్టింది.
The post కెనడాలో కూలిన విమానం,ఆరుగురు గని కార్మికులు దుర్మరణం..!! appeared first on tnewstelugu.com.
