కెనడాలో చదువుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి షేక్ ముజమ్మిల్ అహ్మద్ గుండెపోటుతో చనిపోయాడు. ఒంటారియోలోని వాటర్‌లూ క్యాంపస్‌లో ఉన్న కొనెస్టోగా కాలేజీలో.. డిసెంబర్ 2022 నుంచి మాస్టర్స్ చదువుతున్నాడు. హైదరాబాద్ నగరంలోని టోలిచౌక్‌లో ఉన్న ఆ విద్యార్థి కుటుంబసభ్యులకు అతని మిత్రుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే గత వారం నుంచి అతను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. మిత్రుడి నుంచి ఫోన్ వచ్చిందని, తమ కుమారుడు గుండెపోటుతో మృతిచెందినట్లు తండ్రి షేక్ ముజాఫర్ అహ్మద్ తెలిపారు. ముజమ్మిల్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని ఎంబీటీ నేత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఇది కూడా చదవండి: హెచ్‌సీఏ హెడ్ కోచ్ జైసింహ సస్పెన్షన్
