ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు స్థానిక కోర్టు ఇవాళ( బుధవారం) సమన్లు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 17న విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. లిక్కర్ స్కామ్ ఆరోపణలపై ఇడి జారీ చేసిన ఐదు సమన్లను కేజ్రీవాల్ దాటవేశారు. నోటీసులపై స్పందించి కేజ్రీవాల్ కక్ష్యపూరితమన్నారు. అంతేకాదు ..ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి:అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిపోతోంది
