ఈ మధ్యే వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి కృతిక ఆరోగ్యం మెరుగుపడింది. చిన్నారి తండ్రి సంతు, ఆ ఇంటి యజమాని హరీశ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ సార్ కృతికకు సాయం అందించినందుకు …మీరుచూపిన అసాధారణ ప్రయత్నానికి హృదయపూర్వక కృతజ్ఞతలు..చిన్నారి కృతిక ఆరోగ్యం మెరుగుపడింది. ఇప్పుడు సురక్షితంగా ఉంది. ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. అంటూ కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. కేటీఆర్ స్పందించారు. చిన్నారి క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నందుకు సంతోషం అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఈనెల 17వ తేదీని హబ్సిగూడ పరిధిలోని రాంరెడ్డి నగర్ లో ఇంటి దగ్గర ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశారు.
Glad that the child is safe and healthy 😊 https://t.co/dMdBdEAuDR
— KTR (@KTRBRS) January 23, 2024
పాప ఎడమవైపు దవడ, చెవి, నోటి భాగాల్లో గాయాలయ్యాయి. చిన్నారి తండ్రి దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇంటి యజమాని హరీశ్ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కేటీఆర్…తన టీం అన్ని చూసుకుంటుందని బాధపడొద్దని ధైర్యంగా ఉండమని చెప్పారు.

ఇది కూడా చదవండి: నేటి నుంచి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్..విద్యార్థులు ఇవి తప్పనిసరి..!!
