కేసీఆర్ అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదు.. కేసీఆర్ అంటే త్రీఫేస్ కరెంట్..ముట్టుకుంటే మాడి మసైపోతరని ఆర్మూర్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్ అన్నారు. నల్లగొండలో కేసీఆర్ సభను అడ్డుకుంటామన్న కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సభను అడ్డుకుంటామని చెప్పడం పిరికిపందచర్య అన్నారు. ఎంపీగా ఉన్న ఐదేండ్లలో ఒక్కరోజు ఈ ఏరియాలో ప్రెస్ మీట్ కూడా పెట్టని వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఆరోపించారు. అవగాహన లేని సన్నాసులు, చదువు లేని దద్దమ్మలు కృష్ణా జలాలను మన వాటా తేల్చకుండానే కేఆర్ఎంబీకి అప్పగించడం చేతగానితనమని విమర్శించారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డికి ఆ శాఖపై కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు.
తెలివి లేని సీఎంగా రేవంత్ రావడం ఇక్కడి ప్రజల దురదృష్టమన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యత నీటి సాగునీటిదని గుర్తు చేశారు. కృష్ణ బోర్డు అప్పగిస్తే రైతులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బ్రోకర్స్, జోకర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ బెదిరింపులు కొత్త కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం కదిలి వచ్చినా కేసీఆర్ సభను అడ్డుకోలేరన్నారని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి:తెలంగాణ నీళ్ల హక్కులు కృష్ణార్పణం
