వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట మండలంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రెండో విడత గొర్రెలను పంపిణీ చేశారు. ఎంకెపల్లి గ్రామంలో 12 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పట్నం నరేంద్రరెడ్డి గొర్రెలను పంపిణీ చేశారు.
సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గొల్ల కురుమల యాదవుల కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రణాళిక రూపొందించిందన్నారు. కార్యక్రమంలో పశువైద్యశాల బాధ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
