
నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. గుండుమల్ కొత్త మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘సీఎం కప్ 2023’లో భాగంగా ఎమ్మెల్యే పట్నం నరేంద్రరెడ్డి మండల స్థాయి క్రీడలను ప్రారంభించారు.
పట్నం నరేంద్రరెడ్డి మాట్లాడుతూ పల్లెలకే పరిమితమైన ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించి వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్-2023 క్రీడా పోటీలను ప్రారంభించిందని తెలిపారు. ఈ పోటీల్లో యువతీ, యువకులు పాల్గొనవచ్చని తెలిపారు.
