కొత్తగా పెళ్లయిన ఓ యువకుడు కరెంట్ షాక్‌తో చనిపోయాడు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. చిత్తూరు జిల్లా సోమల మండలం దేవలకుప్పం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు.. స్థానికంగా ఉన్న అటవీప్రాంతంలో గొర్రెలు మేపడానికి వెళ్లారు. అయితే రాత్రి ఇంటికి వచ్చాక చూస్తే.. గొర్రెల గుంపులో కొన్ని గొర్రెలు తప్పిపోయాయి. దాంతో ఆ యువకులు మరోసారి అడవికి వెళ్లి గొర్రెలను వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో అడవిపందుల కోసం అమర్చిన కరెంట్ తీగలను తాకారు. దాంతో గంగాధర్ అనే 20 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే గంగాధర్‌కు మృతితో విషాదచాయలు నెలకొన్నాయి. గంగాధర్‌కు ఇటీవలే పెళ్లి జరిగిందని, ఇప్పుడు అతని మృతితో అతని భార్య ఒంటరిది అయిందని ఇరుకుటుంబాల వారు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భార్య ఆత్మహత్య
The post కొత్త పెళ్లి కొడుకు ప్రాణం తీసిన కరెంట్ తీగ appeared first on tnewstelugu.com.
