
రాష్ట్ర మంత్రివర్గం కొత్త సచివాలయంలో తొలిసారి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సమావేశంలో మంత్రులు అధికారులతో కలిసి పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధ ఉత్సవాలపై చర్చిస్తూనే పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
జూన్ 2 నుంచి 21 రోజుల పాటు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. దేశ అభివృద్ధి నమూనాను ప్రజలకు వివరించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
