రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఐఐటీ జేఈఈకి ప్రిపేర్ అవుతున్న మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యల కట్టడికి చర్యలు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ ఏడాదిలో ఇది నాలుగో మరణం కావడం కలవరపెడుతుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం…జార్ఖండ్ కు చెందిన శుభ్ చౌధరీ రెండేళ్లుగా ఐఐటీ జేఈజీజీకి ప్రిపేర్ అవుతున్నాడు.
నిన్న జేఈఈ మెయిన్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పరీక్షలో తన అంచనాలకు తగ్గట్లుగా మార్కులు రాలేవు. రిజల్ట్స్ చూసిన తర్వాత గదికి వచ్చి…ఈ రోజు ఉదయం సీలింగ్ కు ఉరేసుకుని వేలాడుతున్న అతన్ని గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శుభ్ కుటుంబానికి సమాచారం అందించారు. పోస్టు మార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: సట్లెజ్ నదిలో తమిళ డైరెక్టర్ మృతదేహం..!!
