రంగారెడ్డి: షర్మ్ షాబాద్ విమానాశ్రయంలో అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఎస్వీ-750 విమానంలో దుబాయ్ నుంచి హైదరాబాద్-శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద క్యాప్సూల్ రూపంలో 215 గ్రాముల బంగారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతడి చర్యలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.12,94,450 ఉంటుందని అధికారులు తెలిపారు.
The post క్యాప్సూల్స్ లో బంగారం స్మగ్లింగ్.. appeared first on T News Telugu.
