రవాణాశాఖలో ఖర్చులను తగ్గించి…అదనపు ఆదాయం వచ్చేలా వినూత్న మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖల పద్దులపై సెక్రటేరియట్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సమీక్షించారు.
ఇది కూడా చదవండి: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన ఆర్మీ జవాన్..!!
ఈ సందర్బంగా భట్టి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయని..మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు సర్కార్ కట్టుబడి ఉందన్నారు. మహాలక్ష్మీ స్కీంతో ప్రభుత్వం ఆర్టీసీ ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. రవాణాశాఖ పనితీరు ఇంకా మెరుపడాలని..అంతర్గత ఆదాయ వనరులు పెంచుకునే మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. కార్పొరేషన్ నష్టాలను తగ్గించుకునేందుకు ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. ఖర్చులను తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలని..మెట్రో రైలు తరహాలో ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని కోరారు.
The post ఖర్చులను తగ్గిస్తూ ఆర్టీసీలో ఆదాయం మార్గాలను అన్వేషించాలన్న డిప్యూటీ సీఎం..!! appeared first on tnewstelugu.com.
