గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో ఇవాళ( సోమవారం)విచారణ జరిగింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సిఫారసు చేస్తూ గవర్నర్‌కు నామినేట్ చేసింది. అయితే, ఆ ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించారు.ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండ రామ్, అమీర్ అలీఖాన్‌లను నామినేట్ చేయగా దాన్ని గవర్నర్ ఆమోదించారు.
దీంతో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ నాయకులను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారంటూ గత ప్రభుత్వం ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించారు. అప్పటి ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని.. దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ లేదని వాదించారు. ఆ పిటిషిన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా.. ఈలోపే కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించడం, గవర్నర్ ఆమోదం తెలపడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ మరోసారి హైకోర్టు ను ఆశ్రయించారు.
పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా హైకోర్టులో ఇవాళ వాదనలు కొనసాగాయి. కోదండరాం, అమీర్ అలీఖాన్ వాదనలు వినిపించగా.. హైకోర్టు విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి:కాంగ్రెస్.. అసెంబ్లీలోనూ అబద్ధాలే చెప్పింది, చూపించింది
