ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడార కు ఆకాశ మార్గంలో వెళ్లేవారి కోసం గత మూడు దఫాలుగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది పర్యాటక శాఖ. ఈ సారి కూడా ఎప్పటిలాగే ఏర్పాట్లు చేస్తోంది. హనుమకొండ నుంచి మేడారం వెళ్లేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగుపయనం చేస్తారు. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ధరలు రెండు రోజుల్లో నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.
మేడారం జాతర బుధవారం నుంచి ప్రారంభంమైంది. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లుగా పూజారులు భావిస్తారు. ఈ ఆదివాసీ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము వరకూ జరుగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరం, కన్నెపల్లి సారలమ్మగుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్ద రాజు, గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి.
ఇది కూడా చదవండి:అసెంబ్లీలో కులగణన తీర్మానంపై చర్చ.. మద్దతు తెలిపిన బీఆర్ఎస్
