నేటికాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెసంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది గుండెపోటుతో మరణించారు. దీనంతటికి కారణం మన జీవనశైలే. ఒక్కప్పుడు 60ఏళ్లు పైబడిన వారికి గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు పట్టుమని పదేండ్లు కూడా లేని పిల్లలకు గుండెపోటు వస్తున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్లో వ్యాయామం చేస్తూ యువకులు మరణించిన సంఘటనలు చూశాం.
Read Also: యూనివర్సిటీని పేల్చేసిన ఉగ్రవాదులు.. వైరలవుతున్న వీడియో
తాజాగా హైదరాబాద్ లో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. చిరంజీవి అనే యువకుడు ఓయూ కామర్స్ కాలేజీలో ఎంకామ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం యూనివర్సిటీలోని డీ హాస్టల్ లో ఉంటూ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. కాగా.. శుక్రవారం రాత్రి చిరంజీవి ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
