గుజరాత్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. పడవ మునిగిన ఘటనలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గురువారం గుజరాత్లోని వడోదరలో హరిణి చెరువులో ఓ ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన 27మంది విద్యార్థులు బోట్ రైడ్ కు వెళ్లారు. ఈ క్రమంలో అది పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 14 మంది విద్యార్థులు మరణించారు. పలువురి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read.. సైబరాబాద్లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు కొత్త నిబంధనలు
సహాయ సిబ్బంది, గజ ఈతగాళ్లు గల్లంతైన వారి కోసం వెతుకులాడుతున్నారు. బోట్ రైడ్ సమయంలో విద్యార్థులు ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించనట్లు సమాచారం. ఈ ప్రమాదం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు బోటు ప్రమాదంలో విద్యార్థులు మృతి చెందడంపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తీవ్ర విచారం వ్యక్తం తెలిపారు.
