
వికారాబాద్ జిల్లా: బషీరాబాద్ మండలం పర్వత్ పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో అదృశ్యమైన యువకుడి మృతదేహం బావిలో కనిపించడంతో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 22న కురువ నవీన్ (20 ఏళ్లు) గుడికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి పారిపోయాడు.
నవీన్ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు 23వ తేదీన అదృశ్యం కేసు నమోదు చేశారు. పర్వత్ పల్లి పక్క గ్రామం మర్పల్లి సమీపంలోని వ్యవసాయ పొలంలో ఉన్న బావిలో నవీన్ మృతదేహం లభ్యమైంది. నవీన్ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
