అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. ఈ నేపథ్యంలో రామ మందిరం ప్రారంభోత్సవం, ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దీంతో గూగుల్ ట్రెండ్స్‌లో అయోధ్య రికార్డుబద్దలు కొట్టింది. గూగుల్ లో అత్యధికంగా రాముడు, అయోధ్య, ప్రాణ ప్రతిష్ఠ గురించి సెర్చ్ చేశారు. గూగుల్ ట్రెండ్ లో టాప్ సెర్చ్లన్నీ రామ మందిరానికి సంబంధించినవే ఉన్నాయి.
Also Read.. బీఆర్ఎస్ బోర్న్ ఫర్ పూర్.. నిరంజన్ రెడ్డి
అదేవిధంగా గత 24 గంటల్లో అయోధ్య, హిందూ దేవాలయం, రామ, హారతి, భారతీయ జనతా పార్టీ, అయోధ్య, నరేంద్ర మోదీ, బాబ్రీ మసీద్ కూల్చివేత, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆచార్య ప్రమోద్ కృష్ణం, ప్రాణ ప్రతిష్ఠ, డిగ్నిటీ ఆఫ్ లైఫ్ గురించి నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేశారు.
