రాష్ట్రంలోని పేదలందరికీ సొంత ఇళ్లు ఉండాలన్నదే సీఎం కేసీఆర్ కోరిక అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం రాజన్న పేట గ్రామంలో
గ్రామ పంచాయతీలో రూ.3.5 లక్షలతో నిర్మించిన నూతన కార్యాలయ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ హృదయం ఉన్న నాయకుడని అన్నారు. అందుకే పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించుకునేందుకు సహాయం అందజేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమం అందుతుందని… అర్హులైనప్పటికీ ప్రభుత్వ కార్యక్రమం అందని వారు ఉంటే తప్పకుండా ఆదుకుంటామన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో ముందుకెళ్తోందన్నారు.
The post గృహలక్ష్మి పథకం ద్వారా పేదలందరికీ ఇళ్లు appeared first on T News Telugu.
