
గ్రామీణాభివృద్ధికి దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జాతీయ గ్రామసభల అవార్డుల్లో ఉత్తమ గ్రామసభలు పొందిన 27 మంది సర్పంచ్ లకు జగిత్యాల జిల్లా నిర్వాసితుల కార్యాలయంలో ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న గ్రామాభివృద్ధిలో ఈ గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయన్నారు. పారిశుధ్య నిర్వహణ, మొక్కలు నాటడం, తడి, పొడి చెత్తను వేరు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రామ రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్ సైట్లు, చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్లు, కంపోస్ట్ షెడ్లు, క్రెచ్‌లు, వైకుంఠ ధామాలు వంటి సౌకర్యాలను నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
