
హైదరాబాద్: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎల్వీఎం3-ఎం4 చంద్రయాన్-3ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. చంద్రయాన్-3 విజయంతో భారత అంతరిక్ష పరిశోధన రంగం ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించిందని సీఎం అన్నారు.
