హైదరాబాద్ : చక్రీయ ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. అందువల్ల రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే వారం గరిష్టంగా 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
సోమవారం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఎల్లో వార్నింగ్‌లు జారీ చేశారు.
మరోవైపు నిజామాబాద్, మెదక్, సిదిపేట, వికారాబాద్, కమాన్, మహబూబాబాద్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
