హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు విస్తరించాయి. రుతుపవనాలు పశ్చిమం నుంచి తెలంగాణకు విస్తరిస్తున్నాయి.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో ఈదురుగాలులు, జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇతర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
చలి వాతావరణం. మరో రెండు రోజులు వర్షాలు..! appeared first on T News Telugu
