విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్దకొండమరిలో ఈరోజు (శుక్రవారం) చోటుచేసుకుంది. ట్యాంక్‌లోకి ప్రవేశించిన నలుగురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిలో ముగ్గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మోటారు వైర్లు తెగిపడి నదిలో పడిపోయి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.
చిత్తూరులో విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందిన పోస్ట్ appeared first on T News Telugu.
