ఎల్లిగడ్డ ధరలు పగలే చుక్కలు చూపిస్తున్నాయి. ధర రోజు రోజుకూ పెరుగుతోంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని వారపు అంగడిలో కిలో ఎల్లిగడ్డ ధర రూ. 400పలికింది. ఈ ఏడాది ఎల్లిగడ్డ పంట దిగుబడి సరిగ్గా రాకపోవడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. గత రెండు నెలల నుంచి ఎల్లిగడ్డ ధరలు క్రమంగా పెరుగుతూ ఇప్పుడు రూ. 400 దాటిందని చెబుతున్నారు. ధరలు భారీగా పెరగడంతో కిలో ఎల్లిగడ్డ కొనాలనుకున్న సామాన్యుడు అరకిలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. వచ్చేది పచ్చళ్ల సీజన్ కావడంతో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు.
ఇది కూడా చదవండి: చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి..!!
