మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంటలు చెలరేగాయి. గురువారం తెల్లవారుజామున బాలాజ్నగర్లోని ప్రధాన రహదారిపై రామ చెప్పుల దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. రూ.2.5 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని సుధాకర్ తెలిపారు.
పాఠశాల ప్రారంభం కావడంతో దుకాణానికి పెద్దమొత్తంలో సరుకులు చేరాయని, షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణం మొత్తం దగ్ధమైందని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. సకాలంలో మంటలు ఆర్పివేయడంతో సమీపంలోని దుకాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
