చెరువులో పడి మృతి చెందిన వ్యక్తి సమీపంలోని మ్యాన్‌హోల్‌లో శవమై కనిపించిన సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్ సమీపంలోని మంగళవాణి చెరువులో సంతోష్ అనే బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. రెండు రోజులుగా ఆ చెరువులో సంతోష్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈరోజు చెరువు పక్కనే ఉన్న వాసవి వెంచర్‌లోని మ్యాన్‌హోల్‌లో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయగా అది సంతోష్ మృతదేహమేనని తేలింది. సంతోష్‌ను ఎక్కడైనా హత్య చేసి మ్యాన్ హోల్లో పడవేశారా అనే కోణంలో నమోదైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
The post చెరువులో పడితే… బోరులో తేలుతున్న వ్యక్తి appeared first on T News Telugu.
