తుపాకీ అంటే ఏమిటో కూడా తెలియని మూడేళ్ల చిన్నారి… తుపాకీతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తన సోదరిని కాల్చి చంపింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది.
శాన్ డియాగో కౌంటీలోని ఫాల్‌బ్రూక్‌లో మూడేళ్ల బాలిక తన ఏడాదిన్నర సోదరితో ఇంట్లో తుపాకీతో ఆడుతోంది. ఈ క్రమంలో పొరపాటున ట్రిగ్గర్ నొక్కింది. ఎదురుగా కూర్చున్న పాప తలకు బుల్లెట్ తగిలింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
