తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను సుసంపన్నం చేశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద పునర్‌నిర్మించామని, ముదిరాజులు, గంగపుత్రుల ఆర్థిక స్వావలంబన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలను వదిలే పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. మత్స్య కుటుంబాలు 365 రోజులూ తమ చెరువుల్లో పట్టే చేపలను విక్రయించి ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. వనపర్తి ఈదుల చెరువులో మంగళవారం ఒక్కొక్కటి 7 నుంచి 8 కిలోల బరువున్న చేపలు బయటపడ్డాయి. దాంతో మత్స్య కార్మికులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.
The post చేపలు మెరిసి.. ముదిరాజులు మురిసే appeared first on T News Telugu.
