చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. హెనాన్ ప్రావిన్స్లోని ఓ స్కూల్ హాస్టల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 13 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. హెనాన్ లోని యన్ షాప్ పు గ్రామంలో యింగ్ కై అనే స్కూల్లో హాస్టల్లో శుక్రవారం రాత్రి 11గంటలకు మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చిన జిన్ హువా వార్త సంస్థ తెలిపింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ కేసులో పాఠశాల హెడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల చైనాలో అగ్నిప్రమాదాలు సర్వసాధారణం.
ఇది కూడా చదవండి : యూనివర్సిటీని పేల్చేసిన ఉగ్రవాదులు.. వైరలవుతున్న వీడియో
నవంబర్‌లో ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని బొగ్గు కంపెనీ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 26 మంది చనిపోయారు. అదే సమయంలో, పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రిలో చేరారు. గతేడాది ఏప్రిల్‌లో బీజింగ్‌లోని ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 29 మంది మృతి చెందగా, చాలా మంది కిటికీల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
