చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 49 వాహనాలు ఢీకొన్న ఘటనలో 16 మంది చనిపోయారు.
ఆదివారం నాటి ప్రమాదంలో, హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌షా నగరంలో షుచాంగ్-గ్వాంగ్‌జౌ ఎక్స్‌ప్రెస్‌వేపై 49 వాహనాలు ఢీకొన్నాయి. రెండు కార్లు అతివేగంతో ఢీకొనడంతో మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. స్థానిక ట్రాఫిక్ పోలీసు విభాగం ప్రకారం, ఈ సంఘటనలో 16 మంది మరణించారు మరియు 66 మంది గాయపడ్డారు.
The post చైనాలో విషాదం.. 49 వాహనాలు ఢీ.. 16 మంది మృతి appeared first on T News Telugu.
