ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు బస్సుకు నిప్పు పెట్టారు. నారాయణపూర్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సుకు దంత్వాడా జిల్లాలోని మాలేవాహి ప్రాంతంలో నిప్పు పెట్టారు. బస్సుకు నిప్పంటించే ముందు మావోయిస్టులు ప్రయాణికులను బయటకు పంపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను వారి వారి జిల్లాలకు సురక్షితంగా తరలించినట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బస్సుకు నిప్పంటించిన మావోయిస్టులపై సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.
