భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జనవరి 25న ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. దీని కోసం ఇంగ్లండ్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్‌కు చేరుకుంది. తొలి టెస్టుకు వేదికైన హైదరాబాద్‌లో బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లీష్ జట్టు అడుగుపెట్టింది. శంషాబాద్ విమానాశ్రయంలో నిన్న(ఆదివారం) ఫ్లైట్ దిగిన ఇంగ్లండ్ బృందానికి అక్కడి అధికారులు పూల బొకేలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత స్టోక్స్ టీం ప్రత్యేక బస్సుల్లో హోటల్‌కు వెళ్లింది.
గతేడాది సొంత గడ్డపై యాషెస్ సిరీస్ ను 2-2తో డ్రా చేసుకున్న ఇంగ్లండ్.. వరల్డ్ కప్ తర్వాత వెస్టిండీస్ పర్యటకు వెళ్లిన ఇంగ్లీష్ జట్టు..అబూదాబీలో సన్నద్ధత క్యాంప్‌లో పాల్గొంది. అక్కడి నుంచి నేరుగా స్టోక్స్ సేన భారత విమానం ఎక్కింది. రెండేండ్లుగా బాజ్‌బాల్ ఆటతో జోష్ మీదున్న స్టోక్స్ సేన భారత గడ్డపై అదే తీరుగా చెలరేగాలనే పట్టుదలతో ఉంది.
ఇది కూడా చదవండి: కుటుంబ సమేతంగా అయోధ్యకు చేరుకున్న చిరంజీవి
