హైదరాబాద్: జాతీయస్తాయిలో క్రీడలకు ప్రోత్సాహం కరువైందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో శనివారం జాతీయ స్థాయి కరాటే పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాలంటే ఒక్క క్రికెట్ మాత్రమే అన్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. విద్యార్థి దశ నుండే పిల్లలను తల్లిదండ్రులు క్రీడలలో ప్రోత్సహించాలని సూచించారు. పోటీలలో 10 రాష్ట్రాల నుండి 1000మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
Also Read.. ప్రచార ఆర్భటానికే రేవంత్ దావోస్ పర్యటన
