
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ అగ్రగామిగా ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉపాధి హామీ పథకం అమలు, పంచాయతీరాజ్ రంగం పనితీరుపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎల్లబెల్లి దయాకరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 120 మిలియన్ల పనిదినాలు పెంచిందని, దీని ద్వారా ప్రతి ఒక్కరికీ ఉపాధి లభిస్తుందన్నారు. ఈ నిధులతో గ్రామ పంచాయతీ నూతన భవనం, సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలకు మెటీరియల్ పార్ట్ పనిదినాల్లో పూర్తి చేయాలని మంత్రి ఎల్లబెల్లి ఉన్నతాధికారులను ఆదేశించారు.
