రాష్ట్రంలో ఖాళీగా పోస్టులకు నియామకాలను యుద్ధప్రాతిపదికన చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రేవంత్ రెడ్డి చేప్పారు. 64 కొత్త ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్టంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కావాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. సింగరేణిలో 441 మందికి హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారుణ్య నియామక పత్రాలను అందజేసారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా 441 మందికి కారుణ్య నియామకాల పత్రాలను వారు అందజేశారు. ప్రజాస్వామ్య స్పూర్తికి నిదర్శనంగా, అంబేడ్కర్ విగ్రహ సాక్షిగా నియామకాల పత్రాలను అందజేస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్రను ఎవరూ తగ్గించలేరని ఆయన స్పష్టం చేశారు. పార్టీలు తెలంగాణ సాదనలో వైఫల్యం చెందినా కార్మికులు రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.
సింగరేణిలో 80శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. సింగరేణి కార్మికుల వయసు పెంపుపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల భవిష్యత్ ఆనందంగా ఉండాలని అన్నారు. తెలంగాణలో ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగుల కళ్లలో ఆనందం నింపుతామని సీఎం చెప్పారు.
ఇది కూడా చదవండి: జీవితాంతం సంతోషంగా ఉండాలంటే.. వెంటనే ఈ అలవాట్లకు గుడ్ బై చెప్పండి..!!
