
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కమలానగర్‌లో రూ.1.785 లక్షలతో నిర్మించిన 210 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను గురువారం ఉదయం 11 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు.
210 డబుల్ బెడ్‌రూమ్‌ల నిర్మాణానికి రూ.160,270 లక్షలు, మౌలిక సదుపాయాల పనులకు రూ.1.55 లక్షలు ఖర్చు చేశారు. ఈ కాలనీకి 100 కేఎల్ సామర్థ్యం గల వాటర్ ట్యాంక్, విద్యుత్ సౌకర్యాలతో పాటు 15 దుకాణాలను ఏర్పాటు చేశారు.
