జూబ్లీహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో కలిసి జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పర్యటించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45,36 చెక్ పోస్ట్ ప్రాంతాలను పరిశీలించి ట్రాఫిక్ సమస్యను అధిగ మించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు కమిషనర్.
ఇక అవసరమైన చోట ఫ్లై ఓవర్, గ్రేడ్ సేపెరేటర్లు చేపట్టేందుకు ప్రణాళిక ను సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు.సీఎం ఆదేశాల మేరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీస్, జి హెచ్ ఎం సి, హెచ్ ఎం డి ఎ అధికారుల సమన్వయంతో ప్రణాళిక సిద్దం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు కమిషనర్ వెల్లడి.
The post జూబ్లీహిల్స్ లో హైదరాబాద్ సీపీ ఆకస్మిక పర్యటన..! appeared first on tnewstelugu.com.
