
తిరుమల శ్రీవారి దర్శనానికి రూ.300 టిక్కెట్ల కోటాను ఈ నెల 25న (జూలై) విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. టీటీడీ వెబ్‌సైట్‌లో ఆగస్టు, సెప్టెంబరు కోటాలకు సంబంధించిన టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 4,000 టిక్కెట్ల అదనపు కోటాతో పాటు, అక్టోబర్‌లో ప్రతిరోజూ 15,000 టిక్కెట్లు అందించబడతాయి.
అంతే కాకుండా శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన అక్టోబర్ కోటా వోచర్లను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు, వృద్ధులు, వికలాంగులకు అక్టోబర్ కోటా వోచర్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందజేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.
