జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ డైరెక్టర్ భవనాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారికంగా ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ వల్లూరి క్రాంతి ఛాంబర్లో కూర్చున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను రూ.511.8 కోట్లతో మూడు అంతస్తుల్లో నిర్మించారు. వివిధ శాఖలకు చెందిన 36 జిల్లా స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రి మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, డీజీపీ అంజనీకుమార్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
