తెలంగాణ పాలిసెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 2024-25విద్యాసంవత్సరానికి గాను ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ , టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిటెక్నిక్ ఉమ్మడి ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఎస్ఎస్సీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పాలిసెట్ రాతపరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కాగా దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 22. ఎస్సీ, ఎస్టీలు రూ. 250, ఇతరులు రూ. 500 చెల్లించి ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవాలి. రూ. 100 ఆలస్య రసుముతో ఏప్రిల్ 24లోపు రూ. 300 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 26వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. మే 17వ తేదీని రాతపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహించిన 12రోజులకు ఫలితాలను వెల్లడించనున్నారు. పూర్తి వివరాల కోసం https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ ను లాగిన్ అవ్వండి.
ఇది కూడా చదవండి: సచివాలయం ప్రాంగణంలో ఆ విగ్రహంపై సర్కార్ పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత
The post టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదల..మే 17న ఎగ్జామ్..!! appeared first on tnewstelugu.com.
