హైదరాబాద్ ఉప్పల్ గ్రౌండ్ లో రేపటి టెస్ట్ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. ఉదయం 6:30 నుండి ప్రేక్షకులకు అనుమతి ఉంటుందన్నారు. 1500 మంది పోలీసులతో పాటు ఆక్టోపస్, వివిధ పోలీస్ విభాగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 100 షీ టీమ్స్ మఫ్టీలో ఉంటాయన్నారు. కెమెరాలు, లాప్ టాప్, మ్యాచ్ బాక్స్, పెన్, బ్యాటరీ,హెల్మెట్ లకు అనుమతి లేదన్నారు. ట్రాఫిక్ ఎక్కువ ఉండే సమయంలోనే మ్యాచ్ ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఫేక్ పాస్ లతో వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సీపీ సుధీర్ బాబు.
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరగనుంది.
ఇది కూడా చదవండి: యూఆర్ గ్రేట్ సర్.. చిన్నారి కృతిక సురక్షితం.. కేటీఆర్ కి కృతజ్ఞతలు
