చెన్నై: తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఖండించారు. అవి కేవలం వదంతులేనని, సంచలనం సృష్టించాలనే ఉద్దేశంతో పుట్టించినవని కొట్టి పారేశారు. అదేవిధంగా తన ఆరోగ్యంపైనా కొంతమంది తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read.. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
జనవరి 21న సేలంలో ఉదయనిధి ఆధ్వర్యంలో నిర్వహించనున్న డీఎంకే యువజన విభాగం సమావేశాన్ని వ్యతిరేకిస్తోన్నవారు ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నట్లు సీఎం స్టాలిన్ అన్నారు. రాష్ట్ర హక్కులు, సమాఖ్యవాదాన్ని పరిరక్షించడమే ఈ సదస్సు ఉద్దేశమమన్నారు. దీన్ని వ్యతిరేకించే వారు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
