ఆంధ్రప్రదేశ్ లో టీచర్ పోస్టుల నియామాకాలకు ఆ రాష్ట్రం ఇవాళ(సోమవారం) డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్జీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపు గడువు.. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ.. మార్చి 5 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడింగ్ కు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండ సెషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఉంటుందని.. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు, రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి మరో ఐదేళ్లు పెంచినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: భారీగా ఉద్యోగాలను తీసేయనున్న సిస్కో కంపెనీ
