హైదరాబాద్: డేటా చోరీ కేసులో మరో వ్యక్తిని సైబర్‌బాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద రెండు మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అతని ఇంట్లో 669 మిలియన్ల మంది వ్యక్తుల వివరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న విద్యార్థులు, ఉద్యోగుల వివరాలను నిందితులు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులు inspirewebz వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి వ్యక్తిగత వివరాలను అవసరమైన వారికి విక్రయించారు. జీఎస్టీ, పాన్ కార్డ్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ఫోన్ పే వంటి సిస్టమ్‌ల నుంచి నిందితులు డేటాను దొంగిలించినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.

