
ఢిల్లీలో డ్రోన్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ డ్రగ్స్ ముఠాలో ప్రమేయం ఉన్న ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేశారు. పంజాబ్‌కు చెందిన నిందితులు మల్కిత్ సింగ్, ధర్మేంద్ర సింగ్, హర్పాల్ సింగ్‌లను ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. హవాలా నెట్వర్క్ ద్వారా డ్రగ్స్ మాఫియా నుంచి పాకిస్థాన్‌కు డబ్బును తరలించే బదులు, నిందితులు పంజాబ్ తదితర రాష్ట్రాల్లో డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
