ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దాంతో తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చలి మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారాల మాదిరిగానే ఈ రోజు ఉదయం కూడా అక్కడ 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పూట బయటికి వచ్చిన జనం చలికి గజగజ వణుకుతున్నారు. ఎముకలు కొరికే చలికి తాళలేక పలు ప్రాంతాల్లో జనం చలిమంటలు వేసుకుంటున్నారు. ఇళ్లు కూడా లేని నిస్సహాయులకు ఢిల్లీలోని నైట్ షెల్టర్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఫుట్‌పాత్‌లపై ఉండే పలువురు రాత్రి వేళల్లో ఆ నైట్ షెల్టర్‌లలో తలదాచుకుంటున్నారు.
#WATCH | People take shelter in night shelter homes as the coldwave continues in the national capital
(Visuals from Nizamuddin shelter home) pic.twitter.com/DYpGgH1Bch
— ANI (@ANI) January 16, 2024
Read Also: రాష్ట్రానికి మరో కీలక అవార్డు.. కేసీఆర్ పాలనలో తెలంగాణదే ఫస్ట్ ప్లేస్
చలి కారణంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కమ్ముతోంది. దాంతో రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలు రెండు, మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తరాదిలో పలు రైళ్లు కూడా ఆలస్యంగా రాకపోకలు సాగిస్తుండగా.. మరికొన్ని రైళ్లు మాత్రం పూర్తిగా రద్దయ్యాయి.
#WATCH | Delhi: Several flight operations delayed at IGI airport due to low visibility amid fog. pic.twitter.com/hG1DUKllEt
— ANI (@ANI) January 17, 2024
