
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరు, ఫొటో, వాయిస్‌తో అనుమతి లేకుండా తప్పుడు ప్రచారం చేసినందుకు గుర్తు తెలియని వ్యక్తులపై ముంబై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ విషయంపై సచిన్ వెస్ట్ ముంబై రీజినల్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక మెడికల్ కంపెనీ తమ ఉత్పత్తులను ఆమోదించినట్లు తప్పుడు ప్రకటనలు ఇస్తోందని సచిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ 420 (మోసం), 465 (ఫోర్జరీ), 500 (పరువు నష్టం), ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. తప్పుడు ప్రచారంపై పోలీసులు విచారణ చేపట్టారు.
